ఉద్యోగాల ఊసేది భర్తీ మాటేంటి
రాకేష్ రెడ్డి మండిపాటు
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాయ మాటలు చెప్పి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఎందుకని ఇప్పటి వరకు ఉద్యోగాలను భర్తీ చేయడం లేదంటూ ప్రశ్నించారు.
ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు. ప్రధానంగా నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. గ్రూప్ -1, గ్రూప్ -2 , గ్రూప్ -3 పోస్టులపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేష్ రెడ్డి. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
విచిత్రం ఏమిటంటే చట్టాలు చేసిన వాళ్లకు జీవోలను మార్చడం ఓ లెక్కా అంటూ ఎద్దేవా చేశారు. తక్షణమే జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని అన్నారు రాకేష్ రెడ్డి. 60 మార్కులు వచ్చిన వాళ్లకు జాబ్స్ వచ్చాయని, 90 మార్కులు వచ్చిన వారికి కొలువులు రాక పోవడం దారుణమన్నారు.