సీఎం..జీవోలను సవరించ లేరా
చట్టాలనే మారుస్తున్నారు కదా
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అనుగుల రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన జీవో 46 బాధితులతో మాట్లాడారు. ఈ సందర్బంగా వారికి భరోసా ఇచ్చారు. వారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.
బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు రాకేశ్ రెడ్డి. చట్టాలను తమకు అనుకూలంగా తయారు చేసుకోవడం, వాటిని అమలు చేయడం పనిగా పెట్టుకున్న ప్రభుత్వానికి జీవోలను సవరించడం ఎందుకు చేత కాదని ప్రశ్నించారు . ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
వెంటనే జీవో 46ను రద్దు చేయాలని అనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. లేక పోతే బాధితులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విచిత్రం ఏమిటంటే ఈజీవో కారణంగా కేవలం 60 మార్కులు వచ్చిన వారికి జాబ్స్ వచ్చాయని, 90 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు రాక పోవడం విడ్డూరంగా ఉందన్నారు రాకేశ్ రెడ్డి. సీఎంకు సోయి ఉంటే వెంటనే జీవో 46ను రద్దు చేయాలని అన్నారు.