NEWSTELANGANA

ప్ర‌జా పాల‌న పేరుతో నిర్బంధాలా ..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన అనుగుల రాకేశ్ రెడ్డి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం గాంధీ భ‌వ‌న్ లో నిరాహార‌దీక్ష చేప‌ట్టిన విద్యార్థి నాయ‌కుడు మోతీలాల్ నాయ‌క్ ను స‌రామ‌ర్శించేందుకు త‌న‌తో పాటు ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి కూడా వ‌చ్చార‌ని అన్నారు. త‌మ‌పై పోలీసుల జులుం ప్ర‌ద‌ర్శించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

ప్ర‌జా పాల‌న అంటే ఇదేనా అని నిల‌దీశారు రాకేశ్ రెడ్డి. ఇన్ని ఆంక్ష‌లు, ఇన్ని నిర్బంధాలు ఎందుకు అని మండిప‌డ్డారు. నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుని కలిసే స్వేచ్ఛ కూడా లేకుండా చెయ్యడం ఇదెక్క‌డి అన్యాయ‌మ‌ని వాపోయారు.

తక్షణమే ప్రభుత్వం స్పందించి, విద్యార్థి నిరుద్యోగ బృందాలతో చర్చలు జరపాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వారి న్యాయ ప‌ర‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సీఎంను కోరారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్ -2లో 2 వేలు, గ్రూప్ -3లో 3000 జాబ్స్ క‌ల‌పాల‌ని డిమాండ్ చేశారు రాకేశ్ రెడ్డి. వెంట‌నే జాబ్ క్యాలెండ‌ర్ ను విడుద‌ల చేయాల‌న్నారు.