బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్ లో రాక తప్పదు
ఉత్తర ప్రదేశ్ – కేంద్రంలో కొలువు తీరిన మోడీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ పూర్తిగా విఫలం అయ్యారంటూ మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో ఇలాగే వ్యవహరిస్తూ పోతే , రైతుల సమస్యలను పరిష్కరించక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఘటనలు భారత్ లో వచ్చే అవకాశం లేక పోలేదన్నారు.
తాము తప్పు చేశామని, ఎర్రకోట కాకుండా 25 లక్షల మంది రైతులతో పార్లమెంట్ ను ముట్టడించి ఉండి ఉంటే ఈ పని జరిగి ఉండేది కాదన్నారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న కోల్ కతా డాక్టర్ రేప్ , మర్డర్ కేసు గురించి ప్రస్తావించారు. తాను కూడా బాధ పడుతున్నానని, కానీ కేంద్రం కావాలని రాజకీయం చేస్తోందని ఆరోపించారు రాకేశ్ టికాయత్.