అంతర్జాతీయ రైతు సదస్సు
బెంగళూరు – ప్రముఖ రైతు నాయకుడు, భారత కిసాన్ మోర్చా ముఖ్య నేత రాకేశ్ టికాయత్ శనివారం బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. రాకేశ్ టికాయత్ తో పాటు రైతు నాయకులు యుద్దీర్ సింగ్ , చుక్క నంజుండ స్వామి , ఇతర అంతర్జాతీయ రైతు ప్రతినిధులు కలుసుకున్న వారిలో ఉన్నారు.
వారితో సుదీర్గంగా చర్చలు జరిపారు. కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్బంగా కోరారు రైతు అగ్ర నేత రాకేశ్ టికాయత్. ఇప్పటి వరకు కనీస మద్దతు ధర దక్కడం లేదని వాపోయారు.
పార్లమెంట్ లో కర్ణాటక తరపున ఎన్నికైన ఎంపీలు తమ తరపున గొంతు విప్పాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. తన వంతుగా ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్దంగా ఉన్నానని హామీ ఇచ్చారు. డీకే శివకుమార్, రాకేశ్ తికాయత్ కలుసు కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.