రైతులతో పెట్టుకుంటే ఖబడ్దార్
రైతు నేత రాకేశ్ టికాయత్
న్యూఢిల్లీ – రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది రైతులు స్వచ్చంధంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం హర్యానా..పంజాబ్ శింబు సరిహద్దు వద్దకు చేరుకున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో కవాతు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 200 రైతు సంఘాలు ఉన్నాయి.
సుదూర ప్రాంతాల నుంచి రైతులు బారులు తీరారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించారు. పొద్దస్తమానం కష్టపడి పని చేసే రైతులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించినా చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు రైతు నాయకుడు రాకేశ్ టికాయత్.
మోదీ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. రైతులు లేకుంటే ఈ దేశంలో ప్రగతి అనేది ఆగి పోతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. దేశంలోని వనరులన్నీ కార్పొరేట్ , వ్యాపారస్తుల గుప్పిట్లోకి వెళ్లేలా చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇకనైనా నల్ల చట్టాలు తీసుకు రావాలని ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు టికాయత్.