NEWSNATIONAL

కుల్వింద‌ర్ కుటుంబానికి భ‌రోసా

Share it with your family & friends

ఆమెతో పాటే ఉంటామ‌న్న టికాయ‌త్

ఉత్త‌ర ప్ర‌దేశ్ – ప్ర‌ముఖ రైతు నాయ‌కుడు రాకేశ్ టికాయత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నిన్న చండీగ‌ఢ్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి స్పందించారు. ఇది కావాల‌ని చేసింది కాద‌న్నారు. త‌మ న్యాయ ప‌ర‌మైన డిమాండ్ల సాధ‌న కోసం తాము పోరాటం చేశామ‌ని గుర్తు చేశారు. ఈ ఆందోళ‌న ఇప్ప‌టిది కాద‌ని గ‌త కొన్నేళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తోంద‌న్నారు.

అయితే చండీగ‌ఢ్ ఎయిర్ పోర్ట్ లో బీజేపీ ఎంపీ, ప్ర‌ముఖ న‌టి కంగ‌నా ర‌నౌత్ చెంప పై కొట్టింది కుల్వంద‌ర్ కౌర్. దీంతో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సంచ‌ల‌నంగా మారారు. తాను ఎందుకు దాడి చేయాల్సి వ‌చ్చిందో కూడా ప్ర‌క‌టించారు.

ఆనాడు రైతులు ఆందోళ‌న చేస్తుంటే అత్యంత చుల‌క‌న చేసి మాట్లాడారంటూ మండిప‌డ్డారు రాకేశ్ టికాయ‌త్. ఏది ఏమైనా అన్నం పెట్టే అన్న‌దాత‌ల ప‌ట్ల ఆద‌ర‌ణ క‌న‌బ‌ర్చాల్సింది పోయి వ్య‌తిరేకంగా మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు టికాయ‌త్. ఈ సంద‌ర్బంగా కుల్వింద‌ర్ కౌర్ కుటుంబానికి తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.