జర్నలిజం శక్తి వంతమైన ఆయుధం
బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అనుగుల
హైదరాబాద్ – ప్రపంచాన్ని శాసించి, దిశా నిర్దేశం చేసే ఏకైక ఆయుధం ఒక్కటేనని అది జర్నలిజం, మీడియా మాత్రమేనని గుర్తు పెట్టు కోవాలని స్పష్టం చేశారు భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి అనుగుల. ప్రపంచంలో ప్రతి ఒక్క రంగంలో పని చేసే ప్రతి ఒక్కరికి పదవీ విరమణ అనేది ఉంటుందని, కానీ జర్నలిజం రంగంలో మాత్రం రిటైర్మెంట్ అనేది ఉండదన్నారు.
ఎవరినైనా సీనియర్ జర్నలిస్ట్ అని పిలుస్తారని, కానీ రిటైర్డ్ జర్నలిస్ట్ అని పిలువరని ఈ ఒక్క అరుదైన, అద్భుత గౌరవం కేవలం మీడియా రంగానికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు రాకేష్ రెడ్డి అనుగుల. ఇదిలా ఉండగా తనతో కాకతీయ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ఉత్తీర్ణులైన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు భేటీ అయ్యారు. వారితో కీలకమైన అంశాలపై చర్చించారు బీఆర్ఎస్ నేత.
మీడియా, రాజకీయాలు, సాధారణంగా సమాజంపై వారికి ఉన్న అవగాహనను చూసి తాను విస్తు పోయానని తెలిపారు రాకేష్ రెడ్డి అనుగుల. వారికి తమ పట్ల అవగాహన ఉందని, ఇది తెలంగాణ సమాజానికి మరింత మేలు చేకూరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ నవయుగ జర్నలిస్టులు ప్రస్తుత తెలుగు మీడియా ప్రపంచానికి కొత్త కోణాన్ని రూపొందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.