నటుడు రామ్ చరణ్ కామెంట్స్
హైదరాబాద్ – ప్రముఖ నటుడు రామ్ చరణ్ కీలక ప్రకటన చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం వచ్చేందుకు కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని అన్నారు. తాను శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్బంగా ఈ విషయం వెల్లడించారు. రాజమౌళితో సినిమా చేయాలంటే కనీసం 2 ఏళ్లు పడుతుందన్నారు చెర్రీ.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎస్ఎస్ రాజమౌలి. ఆయనతో పాటు దర్శకుడు శంకర్ , నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
తను తీసిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు ను దక్కించుకుంది. ఈ సందర్బంగా చెర్రీ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినీ చరిత్రలో రికార్డుల మోత మోగించడం ఖాయమన్నారు. ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం తప్పదన్నారు.