కోర్టుకు రామ్ దేవ్ బాబా క్షమాపణ
తప్పైందన్న ఆచర్య బాలకృష్ణ
న్యూఢిల్లీ – యోగా గురు రామ్ దేవ్ బాబా, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఎట్టకేలకు తాము చేసింది తప్పేనంటూ ఒప్పుకున్నారు. ఈ మేరకు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. తాము అలా చేయాల్సింది ఉండేది కాదన్నారు. తమకు దేశం పట్ల గౌరవం ఉందని, అంతకంటే ఎక్కువగా న్యాయ స్థానం పట్ల మమకారం ఉందని స్పష్టం చేశారు రామ్ దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ.
ఇదిలా ఉండగా పతంజలి సంస్థ ఆయుర్వేద ప్రొడక్ట్స్ ను , ఇతర వస్తువులను తయారు చేసి అమ్ముతోంది. సదరు సంస్థ దేశీయ వస్తువులనే వాడాలనే ప్రచారంతో భారీ ఎత్తున అమ్మకాలు సాగిస్తోంది. ఈ సందర్బంగా తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎలా ఇలా మోసం చేస్తారంటూ ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చినా ఎందుకు హాజరు కాలేదంటూ నిలదీసింది.
చివరకు తాము అలా చేసి ఉండాల్సింది కాదని, క్షమించమని కోరారు రామ్ దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ.