పుష్ప-2 టికెట్ ధరల పెంపు సబబే
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్
హైదరాబాద్ – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోసారి ఆయన రెచ్చి పోయారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-2 టికెట్ ధరల పెంపుపై స్పందించారు.
బుధవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప -2 టికెట్ల ధరలు పెంచడం మంచిదేనని పేర్కొన్నారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్ బట్టలపై పెంచితే ఎందుకు అడగడం లేదన్నారు. ఎందుకు పిటిషన్ దాఖలు చేయడం లేదంటూ ప్రశ్నించారు.
సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా టికెట్ ధరల పెంపుపై కోర్టులో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమాల్ పిటిషన్ దాఖలు చేశారు. సామాన్యులకు చూసేందుకు వీలు లేకుండా ఓ మాఫియా రాజ్యం ఏలుతోందని ఆవేదన చెందారు.
డైరెక్టర్, నటుడు, నిర్మాతలకు మేలు చేకూర్చేలా బెనిఫిట్ షో నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. దీనిపై కోర్టు సైతం ఏకీభవించింది. ఒక కుటుంబం చూడాలంటే రూ . 10 వేలు ఖర్చు చేయాలా అని ప్రశ్నించింది.