ఆర్జీవీ సమయం కావాలని అడిగారు
డైరెక్టర్ తరపు లాయర్ డాక్టర్ బాల
హైదరాబాద్ – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన తరపు న్యాయవాది డాక్టర్ బాల. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్వాష్ కొట్టేయలేదని తెలిపారు.
ఆయన మీడియా సమక్షంలో పత్రాలు విడుదల చేశారు. ఇప్పట్లో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాలేరని స్పష్టం చేశారు. సినిమా ప్రాజెక్టులో రామ్ గోపాల్ వర్మ బిజీగా ఉన్నారని చెప్పారు. అందువల్ల కొంత సమయం కావాలని కోరడం జరిగిందని అన్నారు.
షూటింగ్ సమయం ఉండడంతో రెండు నుండి మూడు వారాల పాటు రామ్ గోపాల్ వర్మ సమయం కోరారని తెలిపారు. అయితే అస్పష్టమైన నోటీసులు జారీచేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు న్యాయవాది డాక్టర్ బాల.
అది మానవ హక్కుల ఉల్లంఘనకు వస్తుందని స్పష్టం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఒంగోలు పోలీసులు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ ఎందుకని అందులో స్పష్టత లేదన్నారు. తన క్లయింట్ ఎక్కడికీ వెళ్లలేదన్నారు డాక్టర్ బాల . కాగా వర్మ థర్డ్ డిగ్రీకి భయపడడని అన్నారు.