కొత్త ప్రాజెక్టు ప్రకటించిన దర్శకుడు
భారతీయ సినీ జగత్తులో అత్యంత వివాదాస్పద దర్శకుడిగా పేరు పొందారు రామ్ గోపాల్ వర్మ. సినిమాకు సంబంధించి 24 ఫ్రేమ్స్ ను కంఠతః చెప్పే దమ్మున్న డైరెక్టర్ తను. ఆ మధ్యన పొంతనలేని సినిమాలు చేశాడు. ట్వీట్లతో హోరెత్తించాడు. విమర్శలు, ఆరోపణలు చేస్తూ పోయాడు. కానీ ఎక్కడా తగ్గలేదు. తనపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల గురించి సినిమా కూడా తీశాడు. ఇదే సమయంలో వైఎస్ జగన్ రెడ్డికి వంత పాడారు. తనను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టును ఆశ్రయించాడు.
తాజాగా తాను తాను తీసిన సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సత్య మూవీ గురించి ఆసక్తికర ట్వీట్ కూడా చేశాడు. ఇక నుంచి చెత్త సినిమాలు తీయనంటూ ప్రకటించాడు. మరోసారి తానేమిటో చూపిస్తానంటూ తెలిపాడు రామ్ గోపాల్ వర్మ.
ఇదిలా ఉండగా 1980ల చివరి నుండి 2000ల మధ్యకాలం వరకు భారతీయ సినిమాలో ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు ఆర్జీవీ. ఇక నుంచి సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలు, కీలకమైన అంశాల గురించి ఫోకస్ పెడతానని చెప్పాడు. ఏది ఏమైనా తానేనా ఈ సినిమా తీశానా అంటూ సత్య గురించి కామెంట్ చేశాడు . మొత్తంగా ఆర్జీవీ మనసు మార్చుకోవడం పట్ల అభిమానులు, సినీ రంగానికి చెందిన వారు స్వాగతిస్తున్నారు. వర్మ నాట్ ఏ డైరెక్టర్ హ్యూమన్ , ఫిలసాఫికల్ మోటివేటర్ , మెంటార్ అన్నారు పూరీ జగన్నాత్, కృష్ణ వంశీ.