రేవంత్ రెడ్డితో ఆర్జీవీ భేటీ
సంతోషంగా ఉందన్న డైరెక్టర్
హైదరాబాద్ – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వైరల్ గా మారారు. ఆయన ఏది చేసినా సంచలనమే. శనివారం ఉన్నట్టుండి ఆయన హైదరాబాద్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా వీరిద్దరు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు.
ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణలో బలమైన కేసీఆర్ ను ఢీకొనడమే కాకుండా ఆయనను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు అన్ని వర్గాలతో సత్ సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీలలో కూడా స్నేహితులు, హితులు , సన్నిహితులు ఉన్నారు.
ప్రధానంగా సినీ రంగానికి చెందిన చాలా మంది దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ తో కూడా పరిచయం ఉంది. ప్రధానంగా రామ్ గోపాల్ వర్మతో అత్యంత సన్నిహతంగా ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి. వీరిద్దరి మధ్య రాజకీయాలకు అతీతంగా స్నేహం ఉంది. ఇవాళ సీఎంతో భేటీ అయిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు రామ్ గోపాల్ వర్మ.