భయం నా బ్లడ్ లో లేదు – ఆర్జీవీ
అభిప్రాయాలు చెప్పే హక్కు నాకుంది
హైదరాబాద్ – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. భయం తన బ్లడ్ లో లేదన్నారు. ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తాను ఎక్కడికీ పారి పోలేదన్నారు. చేస్తున్న ప్రచారం అంతా అబద్దమని పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేస్తారని పారి పోయానంటూ వివిధ ప్రసార మాధ్యమాలలో రావడంపై మండిపడ్డారు.
తాను ఏదో పరారీలో ఉన్నానని, ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంతా నేను నా డెన్ ఆఫీసు లోనే ఉన్నానని స్పష్టం చేశారు. అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప ఇంకెక్కడికీ వెళ్ల లేదని పేర్కొన్నారు ఆర్జీవీ.
ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసు లోకి కాలే పెట్ట లేదన్నారు.. పైగా తనను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియా తో కానీ చెప్పలేదన్నారు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసు లోకి ఎందుకు రారంటూ ప్రశ్నించారు డైరెక్టర్.
నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్ గా అసలు సంబంధం లేని వ్యక్తులా మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇవ్వడం విచిత్రంగా ఉందన్నారు ఆర్జీవీ.
ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్ లోని నాలుగు వేర్వేరు జిల్లాల్లో తన మీద ఈ కేసు పెట్టారని తెలిపారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయని , అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదైనట్లు పేర్కొన్నారు డైరెక్టర్.
తనకు నోటీసు అందిన వెంటనే , నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగిందన్నారు. ఆయన కూడా అనుమతించడం జరిగిందని పేర్కొన్నారు. కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం , లేకపోతే విడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియ జేయడం జరిగిందని స్పష్టం చేశారు రామ్ గోపాల్ వర్మ… అదే టైమ్ లొ నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందన్నారు.
తాను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటానని, చాలా సార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేస్తూ ఉంటానని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటానని తెలిపారు. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రం కు సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం , ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగి పోయిందని పేర్కొన్నారు.
తాను పెట్టాను అంటున్న పోస్టులు , వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల లో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగిందన్నారు.ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ప్రతి రోజూ పెడుతున్న వాటి సంగతి ఏంటి అని ప్రశ్నించారు.
BNS 353(2) తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం కిందకు వస్తుంది. తన కేసు విషయం లో ఇది ఎలా వర్తిస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు ఆర్జీవీ.