విజయ్ సేతుపతి రియల్ హీరో
కితాబు ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్ – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం ట్విట్టర్ వేదికగా అరుదైన చిత్రాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ అందమైన క్యాప్షన్ కూడా జోడించాడు.
భారత దేశంలో ఇటీవల మోస్ట్ పాపులర్ నటుడిగా గుర్తింపు పొందారు తమిళ సినీ పరిశ్రమకు చెందిన విజయ్ సేతుపతి. నాయకుడిగా, ప్రతి నాయకుడిగా విభిన్నమైన పాత్రలలో జీవిస్తూ నిర్మాతలకు కాసుల పంట పండించాడు.
ప్రధానంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి డైరెక్టర్ అట్లీ తీసిన జావన్ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించాడు. పలు సినిమాలలో నటుడిగా కూడా నటించనున్నాడు. ఇదిలా ఉండగా ఊహించన రీతిలో విజయ్ సేతుపతితో భేటీ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. ఈ సందర్బంగా కీలక వ్యాఖలే చేశారు రామ్ గోపాల్ వర్మ.
అందరూ తెర మీద నటిస్తారు కానీ విజయ్ సేతుపతి తన వరకు చూస్తే రియల్ హీరో అంటూ కితాబు ఇచ్చాడు. ఇందుకు సంబంధించి షేర్ చేసిన ఫోటో హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ ను ఊపేస్తోంది.