డబ్బులు చెల్లించు లేదంటే శిక్ష
ముంబై – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంథేరి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018లో ఆయనపై కేసు నమోదైంది. తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందంటూ, తనకు డబ్బులు ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి . గత ఆరేళ్లుగా ఈ కేసు సుదీర్ఘంగా నడిచింది. కేసుకు సంబంధించి పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు రామ్ గోపాల్ వర్మకు.
అయినా వాటిని ఖాతరు చేయకుండా వచ్చారు రామ్ గోపాల్ వర్మ. చివరకు తుది తీర్పు వెలువరించింది కోర్టు. సంచలన తీర్పు చెప్పారు న్యాయమూర్తి. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక బాధ్యత కలిగిన దర్శకుడిగా ఉన్న ఆర్జీవీ ఇలా అత్యంత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలు తీసిన వర్మ ఇలా ఎందుకు చేశాడంటూ పేర్కొన్నారు. కక్షి దారుడికి రూ. 3.27 లక్షల నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని లేదంటే 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది కోర్టు.