షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు
హైదరాబాద్ – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 ది రూల్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో కీలక పాత్ర పోషించిన ఇండియన్ ఐకాన్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం నెట్టింట్లో కలకలం రేపుతోంది.
ఎక్స్ వేదికగా మంగళవారం బన్నీని ఉద్దేశించి మెగా బాహుబలి అంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ వెనుక ఎలాంటి అర్థం ఉందోనని ఫ్యాన్స్ చర్చించుకుటున్నారు . ఇదిలా ఉండగా పుష్ప -2 చిత్రం రిలీజ్ కాకుండానే రికార్డు మోత మోగిస్తోంది.
ఏకంగా ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు నవీన్, రామ్ ఎర్నేనిలు ప్రకటించారు. ముందస్తు టికెట్లు గంప గుత్తగా అమ్ముడు పోతున్నాయి. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 12000 థియేటర్లలో పుష్ప 2 ది రూల్ విడుదల అవుతోంది. ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఓకే చెప్పాయి.