సోషల్ మీడియా కేసులపై పునరాలోచించాలి
రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేసుల నమోదు గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను ఎక్కడికీ పారి పోలేదన్నారు. తనకు భయం అంటే ఏమిటీ తెలియదన్నారు. కానీ కేసులు నమోదు చేయడం ఏ ఆధారంగా చేశారో తెలుసు కోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
ప్రతి రోజూ సోషల్ మీడియా (ఎక్స్ – ట్విట్టర్ , లింక్డ్ ఇన్, వాట్సాప్ , ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ) ద్వారా ప్రతి రోజూ లక్షలాది మంది పోస్ట్ లు పోస్ట్ చేస్తుంటారని, తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటారని స్పష్టం చేశారు. వాటన్నింటికీ ఎవరు జవాబుదారీ వహిస్తారంటూ ప్రశ్నించారు. తాను ఏడాది కిందట తీసిన వ్యూహం చిత్రాన్ని చూసి మనోభావాలు దెబ్బ తిన్నాయంటే ఎలా అని అన్నారు.
అలాంటప్పుడు తన మూవీకి క్లియరెన్స్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులపై కూడా కేసు నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాకు సంబంధించి వాస్తవాల ఆధారంగా కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ విషయంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు రామ్ గోపాల్ వర్మ.