అజ్జాతంలోనే రామ్ గోపాల్ వర్మ
పట్టుకునేందుకు పోలీసుల గాలింపు
హైదరాబాద్ – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చర్చనీయాంశంగా మారారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. సీఐ నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని కోరుతూ నోటీసులు ఇచ్చారు. తనకు సమయం కావాలని కోరారు. అయితే కుదరదని స్పష్టం చేశారు. హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు.
తనకు కొంత సమయం కావాలని, తాను ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నానని బదులు ఇచ్చారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన తరపు న్యాయవాది డాక్టర్ బాలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింట్ ను ఇబ్బంది పెట్టడం మంచి పద్దతి కాదన్నారు. ఇదే సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు వస్తుందని ఆరోపించారు.
ఇదిలా ఉండగా గత నాలుగు రోజులుగా రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా ఆర్జీవీ ఇంటికి వచ్చినా అక్కడ లేక పోవడంతో వెనుదిరిగారు. అజ్ఞాతంలోకి వెళ్లాడని, దొరకడం లేదంటూ పేర్కొన్నారు పోలీసులు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలింపులు చేపట్టారు.