రెయిలింగ్ కూలిన ఘటనపై విచారణ
ఒకరు మృతి..ఆరుగురికి తీవ్ర గాయాలు
న్యూఢిల్లీ – ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పైకప్పు కూలి ఒకరు మృతి చెందగా ఆరుగురు తీవ్ర గాయాలైన సంఘటనకు సంబంధించి శుక్రవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరగడం బా\ధా కరమన్నారు. ఈ విషయాన్ని డీజీసీఏ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. రెయిలింగ్ కూలి పోవడంతో ఎయిర్ పోర్టు టెర్మినల్ -1 నుండి నడిచే విమానాలను మూసి వేశామన్నారు. ఈ సందర్బంగా రద్దు చేసిన విమానాలకు సంబంధించి ప్రయాణీకులకు టికెట్లను పూర్తి వాపసు లభిస్తుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఈ ఘటన ఎందుకు జరిగిందనే దానిపై విచారణ కొనసాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు కేంద్ర మంత్రి.