కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
గుంటూరు జిల్లా – బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తెలుగుదేశం పార్టీ వచ్చాకనే బహుజనులకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఏ పార్టీ కూడా వారిని పట్టించు కోలేదన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక పదవులు కల్పించడం జరిగిందని చెప్పారు. బీసీలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సోమవారం గుంటూరులో బీసీ ఆత్మీయ సత్కార సభను చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చం నాయుడు, సబితా దేవి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ చైర్మన్ డేగల ప్రభాకర్ హాజరయ్యారు.
బిసిల బాహుబలి కింజారపు అచ్చం నాయుడు సారథ్యంలో బిసీలు అభివృద్ది చెందడం ఖాయమన్నారు రామ్మోహన్ నాయయుడు. బీసీలంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది టీడీపీనేనని అన్నారు . దివంగత ఎన్టీఆర్ పేదల నాయకుడిగా ఎల్లప్పటికీ గుర్తుండి పోతారని అన్నారు. డైనమిక్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ అభివృద్ది చెందుతోందన్నారు.