NEWSANDHRA PRADESH

తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్

Share it with your family & friends

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు

అమ‌రావ‌తి – కేంద్రంలో కొత్త‌గా కొలువు తీరిన ఏపీకి చెందిన సిక్కోలు బిడ్డ కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు. బుధ‌వారం ఏపీలో జ‌రిగిన సీఎం ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు కేంద్ర‌మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కూడా.

ఈ కార్య‌క్ర‌మానికి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు సినీ, రాజ‌కీయ నాయ‌కులు. ఈ సంద‌ర్బంగా రామ్మోహ‌న్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌మాణ స్వీకారం కంటే ముందు ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్బంగా తెలంగాణ ప్రాంతంలో చోటు చేసుకున్న స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెడతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో భేదాభిప్రాయాల‌కు తావు లేద‌న్నారు. ఈ కేంద్ర ప‌ద‌వి ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యే అవ‌కాశం త‌న‌కు ద‌క్కింద‌ని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఐదుగురికి కేంద్ర కేబినెట్ లో చోటు ద‌క్క‌డం మామూలు విష‌యం కాద‌న్నారు కేంద్ర మంత్రి. ఇక నుంచి రాష్ట్రాలు వేరైనా మ‌నంద‌రం ఒక్క‌టేన‌ని అన్నారు.