అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా సీఎస్ రామకృష్ణా రావును నియమించింది. ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘమైన అనుభవం కారణంగా తనను సిఫారసు చేసినట్లు తెలిపింది. గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా ఆయన పని చేశారు. తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణా రావు కంటే సీనియర్ ఐఏఎస్ లు చాలా మంది ఉన్నా వారందరినీ పక్కన పెట్టిన తనకే ప్రయారిటీ ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న శాంతి కుమారి ఈనెలాఖరున రిటైర్ కానున్నారు. తను రాష్ట్ర సమాచార కమిషనర్ పదవిని ఆశించారు. చివరి దాకా ప్రయత్నం చేశారు. కానీ హైదరాబాద్ యూనివర్శిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తనను జైలుకు పంపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది.
మరో వైపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒకే సామాజిక వర్గానికే ప్రయారిటీ ఇస్తూ వచ్చిందని బడుగు, బలహీన వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రధాన సంస్థలన్నీ ఉన్నత వర్గాలకే దక్కడంతో మండిపడుతున్నారు. ఇక ఏపీ విడి పోయినా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిటైర్ అయిన అధికారులను తీసుకు వచ్చి తెలంగాణలో నియమించారు. రిటైర్డ్ అధికారులు వెళ్లి పోవాలంటూ ఆదేశించినా చాలా మందిని ఇంకా ఆయా పదవులలో కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ సర్కార్ కు పెద్దగా తేడా ఏమీ లేదని తేలి పోయింది. మొత్తంగా సీఎస్ గా రామకృష్ణా రావు చక్రం తిప్పారు. జయేష్ రంజన్ పై ఆరోపణలు ఉన్నా తను కూడా కీ రోల్ పోషిస్తుండడం విశేషం.