రాహుల్ పై ఈసీకి ఫిర్యాదు
రామ్ దాస్ అథవాలే ఫైర్
న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రాజకీయాలను మరింత రక్తి కట్టించేలా చేస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం సీఈసీకి ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు దళిత నేత, కేంద్ర మంత్రి రాం దాస్ అథావలే.
ఆయన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు ఈసీకి సుదీర్ఘ లేఖ అందజేశారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు రాందాస్ అథావలే. బీజేపీ సంకీర్ణ సర్కార్ గనుక దేశంలో వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తారంటూ అనుచిత కామెంట్స్ చేస్తున్నారని, దళిత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజనుల్లో ఆందోళన కలిగించేలా కామెంట్స్ ఉన్నాయంటూ ఆరోపించారు. ఆయన పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరారు.