రామోజీ రావు అరుదైన వ్యక్తి
గేయ రచయిత చంద్రబోస్
హైదరాబాద్ – మీడియా, వినోద రంగంలో చెరుకూరి రామోజీ రావు గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొనియాడారు ప్రముఖ గేయ రచయిత , ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్. ఇవాళ ఆయన లేక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు.
తెలుగు భాష పట్ల రామోజీ రావుకు ఉన్న మమకారం గొప్పందన్నారు. ఆయన వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు చంద్రబోస్. ఆయన మరణం ఇరు తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు .
మీడియా పరంగానే కాకుండా చలన చిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశారంటూ ప్రశంసించారు గేయ రచయిత చంద్రబోస్. మీడియా చీఫ్ గా, నిర్మాతగా 50కి పైగా సినిమాలు తీయడం విశేషమని తెలిపారు. యూనివర్సల్ స్టూడియో నిర్మించడం మామూలు విషయం కాదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.