వారాహి డిక్లరేషన్ పై పవన్ కు మద్దతు
ప్రకటించిన చిల్కూర్ బాలాజీ అర్చకుడు
హైదరాబాద్ – హైదరాబాద్ లోని చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సి. రంగరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన వీడియో సందేశం ద్వారా పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షను అభినందించారు. అంతే కాకుండా వారాహి డిక్లరేషన్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇంత కాలం హిందూ ధర్మం పట్ల, సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరేవారు లేకుండా పోయారని పేర్కొన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి సభ చేపట్టడం , విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైందవులు అంతా మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ గొప్ప పోరాటానికి మద్దతు పలుకుతారని పేర్కొన్నారు.
హైందవ ధర్మం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని దానిని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని స్పష్టం చేవారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, హైందవ ధర్మ పరిరక్షకులు .
ఇదిలా ఉండగా తిరుమల లడ్డూ వివాదంపై విచారణ చేపట్టిన కోర్టు రేపటికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్బంగా ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది.