వైసీపీ అపజయం జగనే కారణం
మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్
అమరావతి – మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు. తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
వైసీపీ ఓడి పోవడానికి కోటరీ కారణం అంటూ వస్తున్న ప్రచారాన్ని తప్పు పట్టారు. కోటరీ కానే కాదని వైసీపీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం జగన్ మోహన్ రెడ్డి తప్ప మరొకరు కాదన్నారు. ఆయన తనంతకు తానుగా మోనార్క్ గా భావించాడని, దీంతో ఎవరూ చెప్పినా వినిపించు కోలేదని వాపోయారు.
దీంతో ప్రజలు దేనినైనా భరిస్తారు కానీ రాచరిక పాలన సాగిస్తామంటే ఎవరూ ఊరుకోరని అన్నారు . అందుకే వైసీపీని ఈ ఎన్నికల్లో బండకేసి కొట్టారని, కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అయినా జగన్ మోహన్ రెడ్డిలో మార్పు రాలేదని అన్నారు మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్.
గత ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డికి ఏదైనా చెప్పుకుందామని వెళ్లినా పట్టించు కోలేదన్నారు. ఇక కోటరీ సంగతి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఆహా ఓహో అంటూ పొగడాలే తప్పా ఇతరులను , ప్రజాప్రతినిధులను గౌరవించిన పాపాన పోలేదన్నారు రాపాక వర ప్రసాద్.
తాను కూడా గత్యంతరం లేక పొగటడం జరిగిందన్నారు. ప్రజల కోసం తప్ప లేదని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాపాక చేసిన కామెంట్స్ కాకా రేపుతున్నాయి.