ముందస్తు బెయిల్ కొట్టేసిన కోర్టు
ఉత్తర ప్రదేశ్ – కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఎంపీ రాకేశ్ రాథోడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా తనను ఎంపీ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో జనవరి 17న రాకేశ్ రాథోడ్ పై కేసు నమోదైంది. యూపీలో సీతాపూర్ కు చెందిన ఎంపీ మీడియాతో మాట్లాడుతుండగా తనన అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త చోటు చేసుకోవడంతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌పై నమోదైన అత్యాచారం కేసులో ఈరోజు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. తనను వివాహం చేసుకుంటానని, రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తానని హామీ ఇచ్చారని ఆమె ఆరోపించింది. ఆమె కాల్ వివరాలు , కాల్ రికార్డింగ్‌లను కూడా పోలీసులతో పంచుకుంది.
గత వారం, ఆ మహిళ భర్త ఐదుగురు వ్యక్తులపై వేర్వేరుగా ఫిర్యాదు చేశాడు, రాథోడ్, అతని కుమారుడు కేసును పరిష్కరించు కోవాలని కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కాగా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఎంపీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది, లొంగిపోవాలని కోరింది.
కాంగ్రెస్‌లో చేరడానికి ముందు, రాథోడ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి బహుజన్ సమాజ్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు.