రాపర్ రెమానా మజాకా
అనంత్..రాధిక రిసెప్షన్ లో
ముంబై – యావత్ ప్రపంచం విస్తు పోయేలా రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ అనిల్ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లి వేడుకలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఏకంగా కేవలం ఈ పెళ్లి వేడుకలకు దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక అంచనా.
ఇదిలా ఉండగా తమ ఆట పాటలతో , అద్భుతమైన గానంతో అలరిస్తూ వస్తున్న సంగీత దర్శకులు, సిని రంగానీకి చెందిన ప్రముఖులు, గాయనీ గాయకులు హాజరయ్యారు. తమ ప్రదర్శనతో ఉర్రూత లూగించారు. ప్రపంచం మెచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అల్లా రఖా రెహమాన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఇదే సమయంలో ఒకే ఒక్క గాయకుడు సెంటర్ ఆఫ్ ప్రోగ్రామ్ గా మారడం విశేషం. అతడు ఎవరో కాదు మోస్ట్ పాపులర్ రాపర్ గా పేరు పొందిన నైజీరియాకు చెందిన రెమా. కేవలం ఒకే ఒక్క పాట కోసం రిలయన్స్ అంబానీ ఏకంగా రూ. 25 కోట్లు ఫీజుగా ఇచ్చినట్లు సమాచారం. ఇది అత్యధిక పారితోషకం కావడం విశేషం. ఫ్లైట్ , ఇతర వసతి ఖర్చులు వేరే. మొత్తంగా తను వచ్చాక అనంత్ అంబానీ వేడుకలు మరింత ఆకర్షణీయంగా మారడం విశేషం.
తను పాడడం మొదలు పెట్టగానే ఒక్కసారిగా హాలంతా డ్యాన్సులతో హోరెత్తి పోయింది. ఇందులో క్రికెటర్ హార్దిక్ పాండ్యా కూడా ఉండడం విశేషం. రెమాతో పాటు అనంత్ అంబానీ డ్యాన్స్ చేయడం విస్తు పోయేలా చేసింది.