మాదిగలపై కాంగ్రెస్ చిన్నచూపు
నిప్పులు చెరిగిన రసమయి బాలకిషన్
హైదరాబాద్ – మాదిగలను కాంగ్రెస్ పార్టీ సర్కార్ చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్. ఈసారి ఎన్నికల్లో గెలుపొందడానికి మాదిగలు తమ ఓటు బ్యాంకుగా ఉపయోగపడ లేదా అని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి.
తాజాగా పార్టీ మారిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుల పేరు చెప్పుకుని పదవులు పొందిన కడియం వారికి అన్యాయం జరుగుతున్న సమయంలో ఏనాడైనా నోరు విప్పారా అని ప్రశ్నించారు రసమయి బాలకిషన్.
శ్రీహరి నమ్మదగిన వ్యక్తి కాదన్నారు. మాదిగ ద్రోహి అంటూ మండిపడ్డారు. రాజయ్య, ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ లాంటి వారిని పార్టీ నుండి వెళ్లిపోయేలా వెంట పడ్డాడంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు కేవలం పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ పంచన చేరాడంటూ ఫైర్ అయ్యారు రసమయి బాలకిషన్.
కడియం శ్రీహరి అనేటోడు మాల, మాదిగ కాదని ఎటూ కాని వాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. లక్షల్లో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వక పోవడం దారుణమన్నారు.