శ్రీవల్లి ది గర్ల్ ఫ్రెండ్ సూపర్
కితాబు ఇచ్చిన సుకుమార్
హైదరాబాద్ – రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్నా కీలక పాత్రలో నటిస్తోంది. తను తాజాగా బన్నీతో కలిసి నటించిన పుష్ప 2 ది రూల్ ఈనెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 12 వేల థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సందర్బంగా డైరెక్టర్ సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప రాజ్ సినిమా తీశాక రష్మిక మందన్నాను ఎవరూ రష్మిక అని పిలవడం లేదని శ్రీవల్లి అంటూ పేరు పెట్టి పిలుస్తున్నారంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద భర్త రాహుల్ రవీంద్రన్. తను నాగార్జునతో మన్మథుడు -2 తీశాడు. ఇదే సమయంలో తను రష్మికతో ది గర్ల్ ఫ్రెండ్ తీశాడు. తను పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేశాడు.
ఇదే సమయంలో సినిమా ప్రోగ్రెస్ గురించి తనతో రాహుల్ రవీంద్రన్ పంచుకున్నాడని, రష్మిక మందన్నా హావ భావాలను అద్బుతంగా తెర మీద చూపించే ప్రయత్నం చేశాడంటూ కితాబు ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.