రష్మిక మందన్నా కామెంట్స్
ముంబై – నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప -2 ప్రీమియర్ షో ఘటనలో రేవతి మృతి చెందడం, మరొకరు తీవ్రంగా గాయపడడం తనను కలిచి వేసిందని అన్నారు. అయితే ఎలాంటి సంబంధం లేక పోయినా బన్నీని అరెస్ట్ చేయడం పట్ల వాపోయారు.
శుక్రవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ బాధాకర ఘటన అంశంలో కేవలం ఒక వ్యక్తిని నిందించడం, టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇదిలా ఉండగా ఇవాళ అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
చిక్కడపల్లి పోలీసులు నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. బన్నీని అదుపులోకి తీసుకున్నారు. తనపై పలు కేసులు నమోదు చేశారు. ఆ వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
దీనిని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బలమైన వాదనలు వినిపించారు. చివరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రూ. 50 వేలు పూచీకత్తుపై చెల్లించి బయటకు వచ్చారు ఐకాన్ స్టార్.