ఎస్వీపీఎన్పీ అకాడమీలో రాష్ట్రీయ ఏక్తా దివస్
హైదరాబాద్ – దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతామని స్పష్టం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో. ఈ సందర్బంగా గురువారం సంస్థలో అకాడమీకి చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అకాడమీ అధికారులు, సిబ్బంది దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తామని ప్రకటించారు.
జాతి క్షేమం కోసం, దేక్ష రక్షణ కోసం బలిదానాలు చేసిన పోలీసు అమరులకు నివాళులు అర్పించారు. అంతకు ముందు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 143 కోట్ల మంది భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మన దేశం బలం, ఐక్యతను చాటుతుందన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి మనందరి మనసుల్లో బలంగా ప్రతిధ్వనిస్తోందన్నారు నరేంద్ర మోడీ.
దేశ రక్షణలో సైనికులది కీలకమైన పాత్ర అని కొనియాడారు. వారిని ఎన్నడూ విస్మరించ లేమన్నారు ప్రధానమంత్రి.
ఈ దేశం ఉన్నంత వరకు సూర్య చంద్రులు ఉన్నంత దాకా మీరు చేసిన బలిదానాలు, త్యాగాలు ఈ జాతి గుర్తు పెట్టుకుంటుందన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.