సోషల్ మీడియాలో హల్ చల్
హైదరాబాద్ – భారత దేశ వ్యాపారవేత్తలలో అగ్రగణ్యుడు టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉన్నా, లెక్కించ లేనంత మందీ మార్బలం ఉన్నా తన మూలాలు మరిచి పోలేదు. కంపెనీలు అంటే కేవలం ధనార్జన మాత్రమే కాదని కేవలం మనుషులను కలిపే ఓ సామూహిక సంస్థ అని నమ్మారు. తను నమ్మిన సిద్దాంతం కోసం ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు.
టాటా నమ్మకానికి , భారతీయ సంప్రదాయానికి, సంస్కృతికి చిరునామా. వ్యాపారానికి కూడా మానవీయ కోణం ఉండాలని పరితపించిన మానవుడు రతన్ టాటా. ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఓ పిల్లాడిని తన వారసుడిగా ప్రకటించారు.
ఎన్నో వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నా..కోట్లు గడిస్తున్నా ఏదో ఒక రోజు భారత దేశంలోని సామాన్యులు సైతం కారులను వాడాలని ఆయన కలలు కన్నారు. ఇదే సమయంలో రూపు దిద్దుకున్నదే టాటా నానో. కానీ అది అనుకోకుండా వర్కవుట్ కాలేదు. తాజాగా సరికొత్త టెక్నాలజీతో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త నానో కారును మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకోవాలి..దానికి మానవీయ కోణం ఉండాలని నమ్మిన రతన్ టాటా గొప్పోడు కదూ.