BUSINESS

టాటా భాగ‌స్వామ్యంతో అభివృద్ది

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ర‌త‌న్ టాటా

అస్సాం – టాటా సంస్థ‌ల చైర్మ‌న్ ర‌త‌న్ టాటా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో వ్యాపార ప‌రంగా విలువ‌ల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. అపార‌మైన వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకోగలిగితే ఎన్నో అద్భుతాల‌ను సృష్టించేందుకు వీలు క‌లుగుతుంద‌ని అన్నారు ర‌త‌న్ టాటా.

అస్సాం ప్ర‌భుత్వంతో టాటా సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా ప‌లు రంగాల‌లో ఫోక‌స్ పెట్ట‌నున్నాయి. ఇదే స‌మ‌యంలో పెట్టిన పెట్టుబ‌డులు క్యాన్స‌ర్ సంర‌క్ష‌ణ కోసం కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు ర‌త‌న్ టాటా.

ఇవాళ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అత్యాధునిక సెమీ కండక్టర్‌లలో అస్సాంను ప్రధాన భూమిక పోషించేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ కొత్త పరిణామం అస్సాంను ప్రపంచ పటంలో ఉంచుతుందని, ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ర‌త‌న్ టాటా.

వీటన్నింటిని సాధ్యం చేసిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వాస్ శర్మ మద్దతు కు, దార్శ‌నిక‌త‌కు ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు ర‌త‌న్ టాటా.