Thursday, April 17, 2025
HomeDEVOTIONALతిరుమ‌ల‌లో ఘ‌నంగా ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు

తిరుమ‌ల‌లో ఘ‌నంగా ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు

పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు

తిరుమ‌ల – తిరుమ‌ల‌లో అంగ‌రంగ వైభ‌వోపేతంగా ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు ప్రారంభం అయ్యాయి. సూర్య ప్ర‌భ వాహ‌నంపై తిరుమాడ వీధుల్లో మ‌లయ‌ప్ప స్వామి రూపంలో స్వామి వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. మంగ‌ళ‌వారం ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ చేప‌ట్టారు.
9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం పై శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఊరేగారు.

ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం పై స్వామి వారు ద‌ర్శ‌నం ఇచ్చారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం,
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం , 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై ఊరేగారు.

ఇదిలా ఉండ‌గా ప్రతి సంవత్సరం మాఘ మాసంలో సప్తమినాడు శ్రీ మలయప్ప స్వామి వారు 7 ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments