Sunday, April 6, 2025
HomeDEVOTIONALరమణీయం శ్రీశైల మల్లన్న రథోత్సవం

రమణీయం శ్రీశైల మల్లన్న రథోత్సవం

శ్రీ‌శైలం పుణ్య క్షేత్రం భ‌క్త జ‌న సందోహం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి రథోత్సవము రమణీయంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముందుగా రథాంగా పూజ రథాంగ హోమం రథాంగ బలి నిర్వహించారు . అనంతరం స్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను రథం పైన అధిరోహింప చేసి అంగరంగ వైభవంగా ఊరేగించారు.
\
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణీయ, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ , దేవస్థానం ఈవో శ్రీనివాస రావు దంపతులు పాల్గొన్నారు. రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.

మ‌హా శివ రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా నిర్వ‌హించిన బ్ర‌హ్మోత్స‌వాల‌కు రికార్డు స్థాయిలో భ‌క్తులు హాజ‌ర‌య్యారు. త‌మ మొక్కుల‌ను తీర్చుకున్నారు శివ స్వాములు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు జిల్లా క‌లెక్ట‌ర్.

క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, త‌దిత‌ర రాష్ట్రాల‌కు చెందిన భ‌క్తులు పోటెత్తారు శ్రీ‌శైల మ‌ల్లికార్జున స్వామి, శ్రీ భ్ర‌మ‌రాంబిక అమ్మ‌వార్ల‌ను.

RELATED ARTICLES

Most Popular

Recent Comments