Saturday, April 19, 2025
HomeNEWSఅర్హులైన వారంద‌రికీ రేష‌న్ కార్డులు

అర్హులైన వారంద‌రికీ రేష‌న్ కార్డులు

ప్ర‌క‌టించిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్ – అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామ‌న్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు రేషన్ కార్డులే ఇవ్వ లేద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి లబ్ది చేకూరేలా ముందుకు వెళ్తున్నామ‌న్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామసభల్లో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారని చెప్పారు.

ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేసి తీరుతామ‌న్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో , ప‌దేళ్ల కాలంలో అన్ని వ‌ర్గాల వారిని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేశారంటూ ఆరోపించారు.

కానీ తాము వ‌చ్చాక ప్ర‌జా పాల‌న కొన‌సాగుతోంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ స్వేచ్ఛ ల‌భించింద‌ని, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఇచ్చిన మాట త‌ప్ప‌లేద‌న్నారు. ఏకంగా 50 వేల‌కు పైగా జాబ్స్ ను భ‌ర్తీ చేశామ‌ని చెప్పారు. గ‌త స‌ర్కార్ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments