సంజూ శాంసన్ ఇన్నింగ్స్ సూపర్
47 బంతులు 6 సిక్స్ లు..11 ఫోర్లు
హైదరాబాద్ – హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన టీ20వ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకోవడమే కాకుండా సెంచరీ సాధించిన కేరళ స్టార్ సంజూ శాంసన్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రికార్డ్ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు చేసింది. 133 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది.
ఈ సందర్బంగా కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సంజూ శాంసన్ 8 సిక్సర్లు, 11 ఫోర్లతో దుమ్ము రేపాడు. అత్యద్భుతమైన శతకం సాధించాడు. తన కెరీర్ లోనే ఇది ఎన్నదగిన సెంచరీగా పేర్కొన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్లు, అనలిస్టులు రవి శాస్త్రి, హర్షా బోగ్లే.
ప్రధానంగా ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్ లో సంజూ శాంసన్ కొట్టిన సిక్స్ అద్భుతం అంటూ కొనియాడారు. టీ20 ఫార్మాట్ లో శాంసన్ రికార్డ్ సెంచరీ నమోదు చేయడం విశేషం. ఎనిమిదవ ఓవర్ లో సంజూ కవర్ రీజియన్ పై సిక్సర్ కొట్టడం సూపర్ అంటూ పేర్కొన్నారు.
ఈ షాట్ తనను విస్తు పోయేలా చేసిందన్నాడు హర్షా బోగ్లే. సంజూ శాంసన్ సిక్స్ కొట్టడం అద్భుతం. అసాధారణ నైపుణ్యం అత్యంత అవసరమని కొనియాడారు . అతడి అసాధారణమైన షాట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చేసిందన్నాడు రవిశాస్త్రి.