జిడ్డూ జాదూగర్ షో
ఆల్ రౌండ్ ప్రదర్శన
ధర్మశాల – తాడో పేడో తేల్చు కోవాల్సిన సమయంలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది చెన్నై సూపర్ కింగ్స్. మొదట బ్యాటింగ్ లో తడబడినా బౌలింగ్ లో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చెన్నై వేదికగా తమను దారుణంగా ఓడించిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను తమ స్వంత మైదానంలో ఓడించి బదులు తీర్చుకుంది.
ప్రధానంగా చెప్పు కోవాల్సింది రవీంద్ర జడేజా. ఈ ఆల్ రౌండర్ మరోసారి తనదైన శైలిలో రాణించాడు. ఓ వైపు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. అంతే కాదు పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో అదుర్స్ అనిపించేలా చేశాడు రవీంద్ర జడేజా అలియాస్ జిడ్డూ.
పంజాబ్ పరాజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో చెన్నై పంజాబ్ ను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఇక జిడ్డూ 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే తుషార్ 35 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. సిమర్ జిత్ సింగ్ 16 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం విశేషం. ఇక రవీంద్ర జడేజా 3 ఫోర్లు 2 సిక్సర్లతో 43 రన్స్ చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.