టీ20 క్రికెట్ కు జిడ్డూ గుడ్ బై
74 మ్యాచ్ లు 54 వికెట్లు 515 రన్స్
బ్రిడ్జి టౌన్ – భారత క్రికెట్ జట్టు క్రికెటర్ రవీంద్ర జడేజా కీలక ప్రకటన చేశాడు. అమెరికా – వెస్టిండీస్ సంయుక్తంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను నిర్వహించింది. ఈ టోర్నీలో రవీంద్ర జడేజా భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించారు.
ఈ సందర్బంగా తన క్రికెట్ లో మరిచి పోలేని అనుభూతిని పొందానని, తన కల నెరవేరిందని చెప్పాడు రవీంద్ర జడేజా. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అద్బుతంగా ఆడింది. అత్యుత్తమ ప్రదర్శనతో టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో దుమ్ము రేపింది. చివరి బంతి వరకు ఉత్కంట భరితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగింది.
టి20 క్రికెట్ ఫార్మాట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు రవీంద్ర జడేజా. టి20 ఫార్మాట్ లో 74 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 515 పరుగులు చేశాడు. 54 వికెట్లు తీశాడు. భారత దేశ జట్టుకు అత్యుత్తమమైన సేవలు అందించాడు. అయితే తాను టి20 ఫార్మాట్ కు మాత్రమే గుడ్ బై చెప్పానని ప్రకటించాడు. ఇతర ఫార్మాట్ లలో తన ఆటను కొనసాగిస్తానని చెప్పాడు.