తిప్పేసిన రవీంద్ర జడేజా
తల్లడిల్లిన కోల్ కతా నైట్ రైడర్స్
చెన్నై – చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన ఐపీఎల్ 2024 లీగ్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. వరుస విజయాలతో దూసుకు పోతున్న కోల్ కతాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు చెన్నై బౌలర్లు.
ప్రధానంగా తన అద్భుతమైన బంతులతో కట్టి పడేశాడు రవీంద్ర జడేజా. తనతో పాటు రెహ్మాన్ కూడా సత్తా చాటాడు. కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చన జిడ్డూ ఏకంగా 3 ప్రధాన వికెట్లు తీశాడు. ఇక తుషార్ దేశ్ పాండే కూడా 33 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే ముస్తాఫిజుర్ 22 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.
ప్రధానంగా రవీంద్ర జడేజా వచ్చీ రావడంతోనే అటాకింగ్ ప్రారంభించాడు. ఏకోశాన కోల్ కతా ప్లేయర్లు ఎదుర్కొనలేక తల్లడిల్లారు. బంతులు మిస్సైల్స్ లాగా రావడంతో గత్యంతరం లేక డిఫెన్స్ ఆడలేక వికెట్లను సమర్పించుకున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా 9 వికెట్లు కోల్పోయి 137 రన్స్ చేసింది. అనంతరం సీఎస్కే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని తక్కువ సమయంలోనే ఛేదించింది.