NEWSNATIONAL

ఇండియాకు 100 ట‌న్నుల బంగారం

Share it with your family & friends

ఇంగ్లండ్ నుంచి తీసుకొచ్చిన ఆర్బీఐ

ముంబై – భార‌త దేశానికి శుభ‌వార్త చెప్పింది రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గ‌తంలో దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి , దివంగ‌త పాముల‌ప‌ర్తి న‌ర‌సింహారావు (పీవీ) ఉన్న స‌మ‌యంలో భార‌త దేశం తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఒక్క రోజు గ‌డిస్తే ఇండియా దివాలా అంచున నిలిచే ప‌రిస్థితి.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఆనాటి దేశ ఆర్థిక మంత్రి గా ఉన్న‌, మాజీ ప్ర‌ధాని డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ పుణ్య‌మా అని ఇండియా గ‌ట్టెక్కింది. గ్లోబల్ మార్కెట్ కు ద్వారాలు తెరిచేలా చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఇండియ‌న్ మార్కెట్ లోకి విదేశీ సంస్థ‌లు ప్ర‌వేశించేలా చేసింది. ఒక ర‌కంగా చెప్పాలంటే భార‌త్ ను కాపాడింది పీవీ కావ‌డం విశేషం.

ఆనాడు ఇండియాను గ‌ట్టెక్కించేలా చేసింది మాత్రం భార‌త్ వ‌ద్ద ఉన్న బంగారం. దీనిని తాక‌ట్టు పెట్టి డబ్బులు అప్పుగా తీసుకున్నారు నాటి ప్ర‌ధాని పీవీ. ఇది జ‌రిగింది 2019లో . నే డు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ హ‌యాంలో ఇంగ్లండ్ లో ఉన్న 100 ట‌న్నుల బంగారాన్ని ఆర్బీఐ ఇండియాకు తీసుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.