ఛాన్స్ ఇచ్చినందుకు మోడీకి థ్యాంక్స్
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తి కాంత దాస్
మహారాష్ట్ర – ఆర్బీఐ గవర్నర్ గా పదవీ విరమణ చేయనున్న శక్తి కాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. మూడు సంవత్సరాల పాటు పూర్తి కాలం విశిష్ట సేవలు అందించడం తన జీవితంలో మరిచి పోలేనని స్పష్టం చేశారు.
తాను గవర్నర్ గా పదవిని స్వీకరించిన సమయంలో భారత దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ఇవాళ ప్రపంచంలోనే అభివృద్ది చెందుతున్న దేశంగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సందర్బంగా తన స్థానంలో నియమించబడిన సంజయ్ మల్హోత్రా సారథ్యంలో భారత్ మరింత ముందుకు వెళుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు శక్తి కాంత దాస్. ఇదే సమయంలో దేశంలోనే అత్యున్నతమైన గవర్నర్ పదవిని తనకు కట్టబెట్టినందుకు, ఇంత కాలం సహాయ సహకారాలు అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు వెల్లడించారు శక్తి కాంత దాస్.