ప్రకటించిన యాజమాన్యం
బెంగళూరు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది మార్చి 20 తర్వాత ప్రారంభమయ్యే టాటా ఐపీఎల్ 2025లో ఆడే ఆర్సీబీ జట్టుకు నూతన కెప్టెన్ గా యంగ్ క్రికెటర్ రజిత్ పాటిదార్ ను నియమించినట్లు వెల్లడించింది. అందరూ విరాట్ కోహ్లీకి ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో బిగ్ షాక్ ఇచ్చింది సీనియర్లకు. రజిత్ పాటిదార్ టీమ్ కు నాయకత్వం వహించేందుకు అర్హుడని స్పష్టం చేసింది.
గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన మెగా వేలం పాటలో రజిత్ పాటిదార్ ను ఆర్సీబీ యాజమాన్యం రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది. కోహ్లీని సంప్రదించినా తను నాయకుడిగా ఉండేందుకు ఒప్పుకోక పోవడంతో చివరకు రజిత్ పాటిదార్ వైపు మొగ్గినట్టు సమాచారం.
మెగా వేలానికి ముందు RCB నిలుపుకున్న ఆటగాళ్లలో పాటిదార్ కూడా ఉన్నాడు . ఇదిలా ఉండగా దేశీవాలి టోర్నీలో కీలక పాత్ర పోషించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలో తను మధ్యప్రదేశ్ కు నాయకత్వం వహించాడు. కెప్టెన్సీ గా అనుభవం ఉండడంతో తనను జట్టుకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపింది.