సత్తా చాటిన బెంగళూరు
గుజరాత్ టైటాన్స్ కు దెబ్బ
బెంగళూరు – ఐపీఎల్ 2024లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో సత్తా చాటింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎలాగైనా సరే ప్లే ఆఫ్స్ కు చేరాలన్న కసితో ఆడింది. ఎట్టకేలకు గుజరాత్ పై గెలుపొంది కసి తీర్చుకుంది.
ప్రథమార్థంలో ఆశించిన మేర రాణించ లేక పోయింది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ ఒక్కడే రాణించినా మిగతా వారెవరూ ఆయనకు సహకరించ లేక పోయారు. కానీ సెకండాఫ్ వచ్చేసరికల్లా సీన్ మారింది జట్టుది. పట్టుదల పెరిగింది ఆటగాళ్లలో.
ప్రత్యర్తి జట్టు గుజరాత్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ షో కనబర్చింది. ప్రధానంగా కెప్టెన్ డుప్లెసిస్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లీ సైతం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక ఆర్సీబీలో మరోసారి అద్బుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు సిరాజ్ యష్ దయాల్. ఈ విజయంతో ఊపిరి పీల్చుకుంది ఆర్సీబీ. ఇకా 38 బాల్స్ ఉండగానే విక్టరీ సాధించడం విశేషం. 6 వికెట్లు కోల్పోయి ఈ గెలుపు అందుకుంది.
గుజరాత్ టైటాన్స్ జట్టులో షారుఖ్ ఖాన్ 37 రన్స్ చేస్తే తెవాటియా 35 పరుగులు చేశారు. ఇక బెంగళూరు జట్టులో డుప్లెసిస్ 23 బంతులు ఎదుర్కొని 64 రన్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీ 42 రన్స్ చేసి కీలక పాత్ర పోషించాడు.