ప్రకటించిన నిఘా వర్గాలు
హైదరాబాద్ – జనవరి 26 రిపబ్లిక్ డే సందర్బంగా నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను జల్లెడ పడుతున్నాయి. భారీ ఎత్తున బలగాలను మోహరించాయి. అసాంఘిక శక్తుల కదలికలు ఉన్నాయంటూ సమాచారం అందడంతో రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అప్రమత్తం అయ్యాయి. నిఘాను పెంచారు. జనవరి 30వ తేదీ వరకు ఎయిర్ పోర్టుకు సందర్శకులు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఇదిలా ఉండగా ప్రతి నిత్యం వేలాది మంది రాక పోకలు సాగిస్తుంటారు శంషాబాద్ విమానాశ్రయం నుండి.
కాగా నిత్యం ఎయిర్ పోర్ట్ ను సందర్శించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణీకులను జల్లెడ పడుతున్నాయి భద్రతా దళాలు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు.