NEWSANDHRA PRADESH

విజ‌య సాయి రెడ్డికి రెహానా థ్యాంక్స్

Share it with your family & friends

సీఎం జ‌గ‌న్ రెడ్డికి రుణ‌ప‌డి ఉంటా

అమ‌రావ‌తి – ప్ర‌ముఖ మీడియా జ‌ర్న‌లిస్ట్ రెహానా బేగంకు అరుదైన అవ‌కాశం ల‌భించింది. వైసీపీ బాస్ , ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏరికోరి రెహానా బేగంను రాష్ట్ర స‌మాచార శాఖ క‌మిష‌న‌ర్ గా నియ‌మించారు. ఈ సంద‌ర్బంగా సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ రెడ్డికి రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

తన‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని, స‌మాచార క‌మిష‌న‌ర్ లో త‌న‌కు చోటు క‌ల్పించినందుకు ఆనందంగా ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో రెహానా బేగం వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డిని క‌లుసుకున్నారు.

ఆయ‌న చేసిన సాయం మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు రెహానా బేగం. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌ను క‌ల‌వ‌డం ఎప్పుడూ నేర్చుకునే అనుభ‌వం అంటూ అభిప్రాయ ప‌డ్డారు . రాష్ట్రంలో స‌మాచార క‌మిష‌న‌ర్ గా త‌న బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు .