సంచలన ప్రకటన చేసిన సంస్థ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీపి కబురు చెప్పింది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. రూ. 65 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్ర వ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ముందుకు వచ్చిందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాంట్స్ కోసం కావాల్సిన భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. సమర్థవంతమైన నాయకత్వం కలిగిన సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ అన్ని రంగాలలో ముందుకు వెళుతోందన్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడం, రాచరిక పాలన సాగించడంతో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు.
కానీ కూటమి సర్కార్ కొలువు తీరాక సీన్ మారిందన్నారు. ఏపీకి ఐటీ, లాజిస్టిక్ కంపెనీలు వెల్లువలా వస్తున్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు కొలుసు పార్థసారథి.